కాకినాడ జిల్లా తునిలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురికి తీవ్ర గాయాలు
రిపోర్టర్: మహేష్
స్థలం: కాకినాడ
కాకినాడ జిల్లా తుని మండలం రాజుల కొత్తూరు సమీపంలో గురువారం పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సును కంటైనర్ లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఉప్పాడకు చెందిన పెళ్లి బృందం తునిలో వివాహం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు అద్దాలు పగులగొట్టి బయటకు వచ్చిన క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు అంబులెన్సుల్లో తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.