ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రెండు డీఏలు విడుదల చేస్తూ ఉత్తర్వులు!

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జూలై నాటి 2.73 శాతం, 2025 జనవరి నాటి 1.82 శాతం డీఏలను చెల్లించనున్నారు. సెప్టెంబర్ నెల జీతంతో పాటు పెంచిన డీఏలను చెల్లించనుండగా, బకాయిలను దశలవారీగా పీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ జీవోలు జారీ చేశారు.