వింజమూరు సమీపంలో ఇసుక లారీని తప్పించబోయి ప్రైవేట్ బస్సు బోల్తా
రిపోర్టర్: కృష్ణ
స్థలం: వింజమూరు
తిరుపతి జిల్లా వింజమూరు మండలం చంద్రపడే సమీపంలోని ఆత్మకూరు వింజమూరు రహదారిపై బెంగళూరు నుంచి వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఇసుక లారీని తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇటీవల నిర్మించిన ఈ రోడ్డు మార్జిన్లు వర్షాలకు దెబ్బతిని మెతక మట్టి ఉండటం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు.