నటులకు కృత్రిమ మేధ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదని మారియన్ స్పష్టం

రిపోర్టర్: కిరణ్ స్థలం: హాలీవుడ్

మానవ సృజనకు కృత్రిమ మేధ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదని హాలీవుడ్ నటి మారియన్ కొటిల్లాడ్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన సాన్ సెబాస్టియన్ ఫెస్టివల్లో ఆమె మాట్లాడుతూ, ఏఐ పాత్రల హావభావాలు సహజంగా ఉండవని, వాటి ప్రవర్తనలో సోమరితనం కనిపిస్తుందని తెలిపారు. సినిమా రంగంలో సాంకేతికత ఎంత పెరిగినా సహజమైన నటనకే ఎప్పటికీ ఆదరణ ఉంటుందని ఆమె పేర్కొన్నారు.