హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న మంత్రి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: హుస్నాబాద్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. కళాశాల మరియు హాస్టల్ వసతులను పరిశీలించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తెలిపిన సమస్యలను మంత్రి నోట్ చేసుకుని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.