మొబైల్స్ వాడితే కళ్ళు పీకేస్తారంటూ విద్యార్థులకు భయపెట్టే పాఠాలు
రిపోర్టర్: అశోక్
స్థలం: Uttarakhand
ఉత్తరాఖండ్‌లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లా ఖాతిమాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మొబైల్ ఫోన్ల వినియోగంపై అవగాహన పేరుతో ఉపాధ్యాయులు తీవ్ర విపరీత ధోరణిని ప్రదర్శించారు. ఎక్కువసేపు సెల్‌ఫోన్ వాడితే డాక్టర్లు కళ్ళు పీకేశారంటూ ఒక విద్యార్థి కళ్ళకు బట్ట కట్టి, రక్తంతో కూడిన నాటకం ఆడించారు. ఈ భయానక వాతావరణాన్ని చూసి చిన్నపిల్లలు ఏడుస్తూ గట్టిగా కేకలు వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది. దీనిపై స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు.