తెర్లం జడ్పీటీసి ఎన్నికలో టీడీపీ ఘనవిజయం: మజ్జి సిరి సహస్ర భారీ గెలుపు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా తెర్లం మండల జడ్పీటీసీ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మజ్జి సిరి సహస్ర ఘనవిజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు. తొలి రౌండ్ నుంచి చివరి వరకు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆమె, సమీప ప్రత్యర్థిపై ఏకంగా ఆరు వేల ఆరు వందల యాభై ఒక్క ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ గెలుపుతో జిల్లాలో పసుపు పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి.