కొత్తవలసలో ఘోర అగ్నిప్రమాదం.. మూడు కార్లు దగ్ధం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అడ్డూరువానిపాలెం సమీపంలోని కార్‌ కేర్ షెడ్డులో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రిపేరుకు వచ్చిన రెండు కార్లు, ఒక స్క్రాప్ కారు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో సుమారు రూ.ఐదు లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా.