ముంబైలో కలకలం: బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్ కు బెదిరింపు కాల్

రిపోర్టర్: నరేష్ స్థలం: ముంబై

బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్ కు ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ వచ్చినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడనంటూ హ్యారీ బాక్సర్ పేరుతో ఈ కాల్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే దీనిపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన క్రైమ్ బ్రాంచ్ అధికారులు బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతుగా విచారిస్తున్నారు.