అమృత్‌సర్‌లో దుండగుల కాల్పుల్లో ఏఎస్‌ఐ హర్జిత్ సింగ్ మృతి
రిపోర్టర్: శివ
స్థలం: అమృత్‌సర్
పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లో గస్తీ నిర్వహిస్తున్న అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ హర్జిత్ సింగ్‌ను దుండగులు కాల్చి చంపారు. భగతవాలా ధాన్యం మార్కెట్ సమీపంలో మోటార్ సైకిల్‌పై పెట్రోలింగ్ చేస్తుండగా గురువారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం భగవంత్ మాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుని కుటుంబానికి రూ. ఒక కోటి పరిహారం ప్రకటించారు.