బ్యాంకు వినియోగదారులకు కీలక అలర్ట్: నవంబర్లో మొత్తం పదహారు రోజులు సెలవులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

నవంబర్ నెలలో దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులకు మొత్తం పదహారు రోజులు సెలవులు ఉండనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిందని అధికారులు తెలిపారు. దీపావళి తదితర పండుగలు, జాతీయ వేడుకలతోపాటు ఆదివారాలు, శనివారాల వారాంతపు సెలవుల కారణంగా ఈ బంద్లు రానున్నాయని వెల్లడించారు. ప్రాంతీయ పండుగలను బట్టి రాష్ట్రాల వారీగా ఈ సెలవుల జాబితా మారుతుందని, కస్టమర్లు ముందే సరిచూసుకోవాలని సూచించారు.