నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరికి తీవ్ర గాయాలు

రిపోర్టర్: హరి స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా పొదలకూరు-నెల్లూరు ప్రధాన రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఆమంచర్ల నుంచి పొదలకూరు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను 108 వాహనంలో ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.