ఆంధ్రా పేపర్ మిల్లుపై పవన్ కల్యాణ్ సీరియస్, యాజమాన్యానికి నోటీసులు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: తూర్పుగోదావరి
రాజమహేంద్రవరం గోదావరి కాలుష్యానికి కారణమవుతున్న ఆంధ్రా పేపర్ మిల్లుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ కీర్తి చేకూరి యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. మంత్రి కందుల దుర్గేశ్ స్పందిస్తూ, కాలుష్యం తగ్గించకుంటే ప్రజా ఉద్యమానికి తామే నాయకత్వం వహిస్తామని, పన్నులు ఎగ్గొడుతున్న మిల్లుపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.