పంచాయతీరాజ్ ఉద్యోగాల నియామకాలు మరియు పదోన్నతులకు స్థానిక క్యాడర్ల ఖరారు
రిపోర్టర్: రాజేష్
స్థలం: అమరావతి
పంచాయతీరాజ్‌శాఖలో ఉద్యోగాల నియామకాలు, పదోన్నతులు, బదిలీలకు సంబంధించి ప్రభుత్వం స్థానిక క్యాడర్లను ఖరారు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ సర్వీస్ నిబంధనలు-2001లో పలు సవరణలు చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సవరించిన ఈ కొత్త నిబంధనలు 2026 జులై 15 నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.