ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సిబ్బందిపై సామాజిక కార్యకర్త తరుణ్ మిశ్రా ఆగ్రహం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: న్యూఢిల్లీ
విమానం ఎక్కేందుకు సమయానికి వెళ్లినా సిబ్బంది అనుమతించలేదంటూ సామాజిక కార్యకర్త తరుణ్ మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు. సంయుక్త విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనపై ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. విమాన బయలుదేరే సమయానికి 25 నిమిషాల ముందే బోర్డింగ్ గేట్లు మూసివేస్తామని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రయాణికుల భద్రతా నిబంధనలు పాటించామని, తగినన్ని ప్రకటనలు చేశామని ఎయిర్ లైన్స్ సిబ్బంది వివరణ ఇచ్చారు.