స్థానిక సంస్థల ఎన్నికలు: రాష్ట్రవ్యాప్తంగా అరవై రెండు శాతం ఓటింగ్ నమోదు
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్వహించిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్ లో మొత్తం అరవై రెండు పాయింట్ పద్దెనిమిది శాతం ఓటింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఒంగోలు నగరపాలికలో అత్యధికంగా డెబ్బై ఒకటి పాయింట్ ఇరవై ఏడు శాతం ఓట్లు పడగా, తిరుపతిలో అత్యల్పంగా నలభై ఆరు పాయింట్ ఎనభై ఐదు శాతం మంది ఓటర్లు మాత్రమే తమ హక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.