విద్యార్థులకు ఘనంగా క్రీడా పోటీల నిర్వహణ

రిపోర్టర్: BHAVANI THADI స్థలం: విజయనగరం

విజయనగరం రోటరీ క్లబ్ సెంట్రల్ ఆధ్వర్యంలో నవతారోత్సవ కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక పేర్ల వారి వీధిలో ఉన్న డెఫ్ అండ్ డంబ్ పాఠశాలలో విద్యార్థులకు కబడ్డీ, కేరమ్స్, మ్యూజికల్ చైర్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకే ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు రోటరీ క్లబ్ చైర్మన్ ముకేశ్ మారుతీరాజే తెలిపారు.కార్యక్రమంలో తేజ, శంకర్ రెడ్డి, చందు, ప్రకాష్, మనోజ్ పాల్గొన్నారు.