విశాఖ రిఫైనరీలో భారీ పేలుడు: ఉలిక్కిపడ్డ పారిశ్రామిక ప్రాంతం
రిపోర్టర్: శివ
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం హెచ్పీసీఎల్ రిఫైనరీలో సోమవారం రాత్రి వ్యర్థ చమురు ట్యాంకు పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించిందని మల్కాపురం సీఐ ఇ.నరసింహరావు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. భారీగా ఎగిసిపడిన మంటలు మరియు నల్లటి పొగతో శ్రీహరిపురం, మల్కాపురం ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫైరింజన్లతో సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారని వెల్లడించారు.