మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భయానక వాతావరణం మధ్య ఎన్నికలు జరిగాయని, ఎక్కడ చూసినా దాడులు, దౌర్జన్యాలు కనిపించాయని ఆరోపించారు. నామినేషన్ల ప్రక్రియ నుంచి పోలింగ్ వరకు పలు చోట్ల అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆమె విమర్శించారు. బూత్ క్యాప్చరింగ్ జరిగిన ప్రతి ప్రాంతంలోనూ రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.