విశాఖలో అద్దె వివాదం పరిష్కరించిన పోలీసులకు మహిళ కృతజ్ఞతలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం భీమునిపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో అద్దె వివాదంలో చిక్కుకున్న మహిళకు సిఐపి చొరవతో ఊరట లభించింది. తన ఇంటికి పది నెలలుగా అద్దె చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్న మహిళపై బాధితురాలు నగర పోలీస్ కమిషనర్ ను ఆశ్రయించారు. స్పందించిన అధికారులు తక్షణ చర్యలు తీసుకోవడంతో సమస్య పరిష్కారమైంది. దీంతో తనకు న్యాయం చేసిన విశాఖ సిటీ పోలీసులకు బాధితురాలైన మహిళ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.