రూ.1.5 కోట్ల విలువైన వాచ్ ధరించిన రాధికా మర్చంట్

రిపోర్టర్: రాము స్థలం: India

ముకేశ్ అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ ఇటీవల ధరించిన లగ్జరీ వాచ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 18 క్యారెట్ల వైట్ గోల్డ్, 1,700కు పైగా వజ్రాలు, మరకతాలతో తయారు చేసిన పటెక్ ఫిలిప్ వాచ్ ధరించి ఆమె మెరిశారు. ఈ అరుదైన టైమ్‌పీస్ రిటైల్ ధర భారతీయ కరెన్సీలో అక్షరాలా రూ.1.51 కోట్లుగా ఉండటంతో అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.