ఇండోనేషియా సమీపంలో 240 మందితో భారీ నౌక గల్లంతు

రిపోర్టర్: అశోక్ స్థలం: World

ఇండోనేషియాలోని జావా సముద్రంలో 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న 'విర్గో ట్రాన్స్‌పోర్ట్ 8' నౌక గల్లంతైంది. తూర్పు జావా నుంచి కాళీమంతన్‌కు బయల్దేరిన ఈ నౌకతో కమ్యూనికేషన్ తెగిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చివరిసారిగా బంజార్‌మసన్‌కు 148 కిలోమీటర్ల దూరంలో సంబంధాలు నిలిచిపోయినట్లు వెల్లడించారు. సముద్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల నడుమ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.