పందిల్ల గ్రామంలో ఘనంగా పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం నిర్వహణ
రిపోర్టర్: Damidi Chandra Reddy
స్థలం: హుస్నాబాద్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామంలో మంగళవారం రోజున పరిశుభ్రత పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో అన్ని వాడల్లో స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.