కొత్త ఒరవడి: స్కూలుకు వెళ్లకుండానే వినూత్న రీతిలో పిల్లలకు చదువు చెబుతున్న దంపతులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: కోల్‌కతా

పిల్లలను బడికి పంపకుండా వినూత్న పద్ధతిలో చదువు చెప్పిస్తున్నట్లు కోల్కతాకు చెందిన ఇఫ్తెఖార్ అహ్సాన్, షాహిరా దంపతులు తెలిపారు. తమ పన్నెండేళ్ల కవల పిల్లలకు నిత్య జీవిత అనుభవాలు, ప్రయాణాలు, క్రీడలు, ఇంటర్నెట్ ద్వారా విద్యను అందిస్తున్నట్లు వెల్లడించారు. సాంప్రదాయ పాఠశాలల ఒత్తిడి నుంచి పిల్లలను కాపాడేందుకే ఈ అన్స్కూలింగ్ విధానాన్ని ఎంచుకున్నామని, విద్య అంటే కేవలం తరగతి గదులకే పరిమితం కాదని అహ్సాన్ స్పష్టం చేశారు.