మోదీ ఆయురారోగ్యాలకై అయినవిల్లి విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు
రిపోర్టర్: Y.V.RAMANA
స్థలం: అయినవిల్లి
దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలోని ప్రసిద్ధ శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మండల బీజేపీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పేరు మీద ప్రత్యేక లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. ఆలయ అర్చకులు గోత్రనామాలతో అభిషేకాలు చేసి, మోదీకి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని స్వామివారిని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.