క్షుద్ర పూజల ఆరోపణలపై పరువు నష్టం దావా వేసిన హరీష్ రావు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: సిద్దిపేట

తనపై క్షుద్ర పూజలు చేశానంటూ నిరాధార ఆరోపణలు చేసిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మరియు అద్దంకి దయాకర్లపై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు న్యాయస్థానంలో పరువు నష్టం దావా వేశారు. రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తన ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అబద్ధాలు ప్రచారం చేసే వారికి శిక్ష తప్పదని హరీష్ రావు హెచ్చరించారు.