పులివెందుల కౌంటింగ్ కు గ్రీన్ సిగ్నల్: వైసీపీ పిటిషన్ డిస్మిస్ చేసిన హైకోర్టు
రిపోర్టర్: వెంకట్
స్థలం: కడప
పులివెందుల మున్సిపాలిటీలో రీపోలింగ్ నిర్వహించాలని కోరుతూ వైసీపీ నాయకులు దాఖలు చేసిన పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం కొట్టివేసిందని అధికారులు వెల్లడించారు. రీపోలింగ్ కు తగిన కారణాలు లేవని స్పష్టం చేసిన న్యాయస్థానం, యథావిధిగా ఓట్ల లెక్కింపు నిర్వహించుకోవచ్చని తేల్చిచెప్పింది. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో ఫలితాల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించేందుకు ఎన్నికల అధికారులు సిద్ధమయ్యారు.