చరిత్ర సృష్టించిన వందేభారత్: చీనాబ్ వంతెనపై గంటకు నూరు కిలోమీటర్ల వేగంతో పరుగు
రిపోర్టర్: గోపి
స్థలం: Jammu and Kashmir
భారతీయ రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంజనీరింగ్ అద్భుతం తాజాగా మరో మైలురాయిని అధిగమించింది. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ వంతెనపై తొలిసారిగా వందేభారత్ రైలు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో విజయవంతంగా ప్రయాణించిందని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ చారిత్రాత్మక ఘట్టం దేశీయ రవాణా రంగంలో నూతన శకానికి నాంది పలికిందని, ఈ అరుదైన విజయం దేశ ప్రజలకు గర్వకారణమని అధికారులు తెలిపారు.