లక్ష ఒక్క రూపాయికి అరుంధతివాడ గణేష్ లడ్డు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: అనుమసముద్రంపేట
అనుమసముద్రంపేట మండలంలోని చిరమణ గ్రామపంచాయతీ మజారా గ్రామమైన మదారాబాదులోని అరుంధతివాడలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసిన గణేష్ ఉత్సవ విగ్రహం వద్ద నిర్వహించిన లడ్డూ వేలంపాటలో బద్దెపూడి హరీష్ ఒక లక్ష ఒక్క రూపాయికి లడ్డూను దక్కించుకున్నారు. ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలు అందుకున్న స్వామివారి లడ్డూను వేలం పాటలో సొంతం చేసుకున్న అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు మంగళ వాయిద్యాల నడుమ ఆయనకు లడ్డూను అందించారు.