సికింద్రాబాద్ నియోజకవర్గంలో అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన కిషన్ రెడ్డి
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆంగన్ మిలన్ సేవా కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని పలు అంగన్వాడీ కేంద్రాలను G Kishan Reddy సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లోని చిన్నారులతో కొంత సమయం గడిపడంతో పాటు తల్లులు, అంగన్వాడీ కార్యకర్తలతో ఆయన ముచ్చటించారు. వారి సమస్యలు, సేవలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో అంగన్వాడీల పనితీరు, పిల్లల సంక్షేమ వసతులను పరిశీలించినట్లు G Kishan Reddy వెల్లడించారు.