పాకిస్థాన్ క్రికెట్‌ను ఆకిబ్ జావెద్ భ్రష్టు పట్టించారు: జాసన్ గిల్లెపి
రిపోర్టర్: హరి
స్థలం: World
పాకిస్థాన్ మాజీ హెడ్ కోచ్ జాసన్ గిల్లెపి చీఫ్ సెలెక్టర్ ఆకిబ్ జావెద్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. జావెద్ రాకతో పాక్ క్రికెట్ దిశ పూర్తిగా మారిపోయిందని, తనను తీవ్రంగా అవమానించారని ఆరోపించారు. ఫాస్ట్ బౌలింగ్‌ను ప్రోత్సహించాలన్న తమ ప్రణాళికలను జావెద్ భగ్నం చేశారని, ఆయన సర్వాధికారాలతో జట్టును తన గుప్పిట్లోకి తీసుకున్నారని మండిపడ్డారు.