ఎండ తీవ్రతకు వ్యవసాయ కూలీ మృతి: వరంగల్ జిల్లాలో విషాదం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: నల్లబెల్లి

జిల్లాలోని నల్లబెల్లి మండలం బొల్లోనిపల్లిలో పత్తి ఏరేందుకు వెళ్లిన వ్యవసాయ కూలీ పోలుదాసరి రాజేశ్వరి ఎండ తీవ్రతకు తాళలేక అకస్మాత్తుగా స్పృహ తప్పి కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు రాజేశ్వరిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి అత్యవసరంగా తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.