ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులపై వెల్స్పన్ సంస్థతో మంత్రి లోకేష్ చర్చలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: అహ్మదాబాద్
ఆంధ్రప్రదేశ్‌లో నూతన పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ అహ్మదాబాద్‌లో వెల్స్పన్ గ్రూప్ సీఈఓ నితిన్ జైన్‌తో భేటీ అయ్యారని అధికారులు తెలిపారు. విశాఖపట్నంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటుతో పాటు కాకినాడలో టెక్స్టైల్స్, గ్రీన్ అమోనియా యూనిట్ల ఏర్పాటుకు వెల్స్పన్ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మించాలని మంత్రి కోరారు. గతంలో సీఎం చంద్రబాబుతో జరిగిన చర్చల పురోగతిని సమీక్షించామని, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని సీఈఓ నితిన్ జైన్ వెల్లడించారు.