అసెంబ్లీ సాక్షిగా నియోజకవర్గ సమస్యలపై గళమెత్తిన ప్రజా ప్రతినిధి

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

కల్వకుర్తి నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్ స్తంభాలు, కరెంట్ వైర్ల మార్పు సమస్యను స్థానిక శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి తక్షణమే స్పందించాలని కోరారు. ప్రజల ఇబ్బందులను నివారించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.