బాంబే హైకోర్టులో ఇమ్రాన్ ఖాన్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Mumbai

భారత్ విడిచి వెళ్లాలని ఎఫ్ఆర్ఆర్వో జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ నటుడు ఇమ్రాన్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్పై బాంబే హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఇమ్రాన్ ఖాన్ తరఫు న్యాయవాదులు కోరిన వాయిదా అభ్యర్థనను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యతిరేకించలేదని, ఈ మేరకు తదుపరి విచారణ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు జరగనుందని న్యాయస్థానం స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు.