'ఆస్తిపై స్టేటస్ కో కొనసాగించండి': బోనీ కపూర్ కుటుంబానికి సుప్రీంకోర్టు నోటీసులు
రిపోర్టర్: గోపి
స్థలం: చెన్నై
దివంగత ప్రముఖ నటి శ్రీదేవి కుటుంబానికి చెందిన చెన్నై ఆస్తి వివాదంలో సుప్రీంకోర్టు అత్యంత కీలక ఆదేశాలు జారీ చేసింది. చెన్నైలోని సదరు భూమికి సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిస్థితినే యథాతథంగా కొనసాగించాలని స్పష్టం చేస్తూ.. జస్టిస్ కె.వి.విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లీల ధర్మాసనం శ్రీదేవి భర్త బోనీ కపూర్ తో పాటు కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్లకు నోటీసులు జారీ చేసింది. 1988 నాటి సేల్ డీడ్పై చెలరేగిన ఈ వివాదంలో మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ఈ ఆదేశాలిచ్చింది.