ఎన్ సీ 51 సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న నవీన్ చంద్ర

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

నవీన్ చంద్ర హీరోగా ఆర్పీ బాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్ సీ 51 చిత్ర షూటింగ్ పూర్తియినట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని వారు పేర్కొన్నారు. వైవిధ్యమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రం నవీన్ చంద్ర కెరీర్లో అత్యుత్తమ చిత్రంగా నిలుస్తుందని చిత్ర యూనిట్ వెల్లడించింది.