ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు: అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: విజయవాడ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు కనకదుర్గమ్మ దర్శనమిచ్చారు. ఈ పవిత్రమైన రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ సంప్రదాయబద్ధంగా పసుపు, కుంకుమలు, కానుకలు అందించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.