భారీ వర్షాల బీభత్సం: మల్లికార్జునపేట కొండ ప్రాంతవాసుల తరలింపు
రిపోర్టర్: విజయ్
స్థలం: ఎన్టీఆర్
భారీ వర్షాల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఆదేశాల మేరకు వన్ టౌన్ సీఐ గుణరామ్ మరియు సిబ్బంది మున్సిపల్ అధికారులతో కలిసి మల్లికార్జునపేట కొండ ప్రాంత నివాసితులను గాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావస కేంద్రానికి సురక్షితంగా తరలిస్తున్నట్లు విజయవాడ సిటీ పోలీస్ వెల్లడించారు. ఈ పునరావస కేంద్రంలో బాధితులకు అన్ని వసతులతో పాటు భద్రతా చర్యలు కల్పించినట్లు వారు తెలిపారు.