బ్రిక్స్ డిక్లరేషన్‌లో అమెరికాకు పరోక్ష చురకలు, ఇజ్రాయెల్‌పై విమర్శలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: New Delhi

దిల్లీ వేదికగా ఆమోదం పొందిన బ్రిక్స్ న్యూదిల్లీ డిక్లరేషన్‌లో అమెరికాకు పరోక్షంగా చురకలు అంటించారు. ఏకపక్ష ఆంక్షలను ఖండిస్తూ ఇరాన్‌కు మద్దతు తెలిపారు. గాజాలో బలవంతపు వలసలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్‌పై నేరుగా విమర్శలు గుప్పించారు. భారత్ తన తటస్థ దౌత్య విధానాన్ని అత్యంత సమర్థవంతంగా బ్యాలెన్స్ చేసిందని దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.