రాజ్యాంగం వల్లే దళితులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం: తాడికొండ రాజయ్య స్పష్టీకరణ
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండల కేంద్రంలో జరిగిన సన్మాన వేడుకలో తెలంగాణ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి తాడికొండ రాజయ్య మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే దళితులకు చట్టసభలు మరియు స్థానిక సంస్థల్లో సముచిత ప్రాతినిధ్యం లభిస్తోందని తెలిపారు. మండలంలోని మీనాక్షి ఫంక్షన్ హాల్ లో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు.