విద్యార్థుల భద్రతపై రాజీపడే ప్రసక్తే లేదంటూ ఖమ్మం కలెక్టర్ దివాకర హెచ్చరిక

రిపోర్టర్: హరి స్థలం: ఖమ్మం

రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత మరియు ఆరోగ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం సహించబోమని, విద్య, వసతి, భోజనం వంటి మౌలిక వసతుల కల్పనలో అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ స్పష్టం చేశారు. ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులను ఈ మేరకు ఆదేశించారు. విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఖమ్మం (Collector Khammam) పేర్కొన్నారు.