కింతలి పాఠశాలకు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి విరాళం: పరదాలు అందజేత
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పొందూరు
పొందూరు మండలం కింతలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి దుంపల రమణ మంగళవారం రూ.13,200 విలువైన పరదాలను విరాళంగా అందజేశారు. ఉర్లాం గ్రామానికి చెందిన ఆయన విద్యార్థుల విద్యా వికాసానికి, పోటీల నిర్వహణకు తోడ్పడాలని ఈ సాయం చేశారు. క్విజ్, వ్యాసరచన, డ్రాయింగ్, యోగా వంటి కార్యక్రమాలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూర్యారావు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శశిభూషణ్, బాబురావు పాల్గొని దాతకు ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు.