పొదలకూరు జెడ్పీటీసీ ఎన్నికల్లో ఉత్కంఠ పోరులో దూసుకెళ్లిన ప్రభాకర్ రెడ్డి
రిపోర్టర్: Venkey ...Nlr
స్థలం: పొదలకూరు
సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని పొదలకూరు మండలం జెడ్పీటీసీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కలిచేటి ప్రభాకర్ రెడ్డి నలభై ఆరు ఓట్ల స్వల్ప మెజార్టీతో కైవసం చేసుకున్నారు. ఉత్కంఠభరితంగా సాగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో చివరి క్షణం వరకు తీవ్ర టెన్షన్ నెలకొంది. ఈ విజయంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు స్థానికంగా ఘనంగా సంబరాలు జరుపుకుంటూ విజేతకు అభినందనలు తెలిపారు.