షిర్డీ సాయిబాబా త్రయంబకేశ్వర్ దర్శనానికి ఐఆర్సీటీసీ ప్రత్యేక యాత్ర
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Hyderabad
షిర్డీ సాయిబాబాతో పాటు త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేకంగా సాయి శివం టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ యాత్ర హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం 3ఏసీ మరియు స్లీపర్ క్లాస్ వసతితో పాటు అల్పాహారం సౌకర్యం కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మూడు రాత్రులు, నాలుగు రోజుల పాటు సాగే ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి సంబంధించిన ధరల వివరాలను ఐఆర్సీటీసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.