ఖమ్మం పరేడ్ గ్రౌండ్స్‌లో అంబరాన్నంటిన పోలీస్ కుటుంబాల బతుకమ్మ సంబరాలు
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం పోలీస్ పరేడ్ మైదానంలో పోలీస్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఆయన సతీమణి నిష్టాశర్మ గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేసి ఈ వేడుకలను ప్రారంభించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ కోలాటాలు ఆడి ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.