'శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం': విశాఖలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్

రిపోర్టర్: రాజేష్ స్థలం: Visakhapatnam

విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా అక్రమంగా నిల్వ ఉంచిన పది మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.