పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని చౌటుప్పల్లో మానవహారం
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
తెలంగాణ రాష్ట్ర డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ పిలుపు మేరకు చౌటుప్పల్ గాంధీ పార్కు ఆవరణలో డిగ్రీ కళాశాలల ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ గౌరవ అధ్యక్షుడు బత్తుల శంకర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిల విడుదలలో జాప్యం వల్ల కళాశాలలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.