మద్యం రవాణా కుంభకోణం కేసులో విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు

రిపోర్టర్: రాము స్థలం: Amaravati

వైకాపా హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణం కేసులో చిత్తూరు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ ఎంసీ విజయానందరెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. నిఖిలానంద లాజిస్టిక్స్ పేరిట మద్యం రవాణా సబ్కాంట్రాక్టు దక్కించుకుని భారీగా అనుచిత లబ్ధి పొందినట్లు ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆయనను ఆదేశించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద విజయానందరెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.