చెకుముకి సైన్స్ వేడుకలో బల్ల విద్యార్థుల ప్రతిభ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: రామకుప్పం
రామకుప్పం మండలంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన చెకుముకి మండలస్థాయి పరీక్షల్లో బల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానం సాధించి విజేతలుగా నిలిచారు. అనిగానూరు, రామకుప్పం బాలుర పాఠశాలలు ద్వితీయ స్థానం దక్కించుకోగా, చెలిగానిపల్లి పాఠశాల తృతీయ స్థానం సాధించింది. ఈ కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేసి ఘనంగా సత్కరించారు.